సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 01:51:10

ఫార్మాసిటీకి నిధులివ్వండి

ఫార్మాసిటీకి నిధులివ్వండి

  • రూ.3,500 కోట్లు కేటాయించండి 
  • లోక్‌సభలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మాసిటీకి రూ.3,500 కోట్ల సాయంచేయాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభ లో 377 నిబంధన కింద ప్రభాకర్‌రెడ్డి మాట్లాడు తూ..తెలంగాణ ప్రభుత్వం ఫార్మారంగంలో ప్రప ంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను 19 వేల ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్నదని వివరించారు. ఈ మొ త్తాన్ని గ్రాంట్‌రూపంలోఇవ్వాలని కేంద్రాన్ని కోరా రు. హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా కొనసాగుతున్నదని తెలిపారు. ఈ ఫార్మాసిటీ ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సైన్స్‌సిటీ క్యాపిటల్‌గా మారబోతున్నదని పేర్కొన్నారు. అనేక పరిశోధన సంస్థలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయని, పరిశోధనల్లో దేశంలోనే నంబర్‌వన్‌ సిటీగా మారబోతున్నదని తెలిపారు. కరోనా నేపథ్యంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం ఆవశ్యకత ఎంతో ఉన్నదని, ఇందుకు అనుగుణంగా ఫార్మాసిటీకి నిధులు కేటాయించాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. దీనిపై ప్ర భుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. 

బ్యాంకులపై నమ్మకం కలిగించాలి

బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభలో బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నారు. వ్యవసాయం,వాణిజ్య అవసరాలకు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో బ్యాంకుల ఏర్పాటు అవసరం ఉన్నదని, గ్రామీణ ప్రాంతాల్లో సహకార బ్యాంకులను ఏర్పాటుచేయాల్సి ఉన్నదని తెలిపారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో బ్యాంకింగ్‌రంగంపై నమ్మకం తగ్గుతున్నదని, దీనిని పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. దేశాభివృద్ధిలో బ్యాంకులది కీలకపాత్ర అని, పరిశ్రమల స్థాపన, ఉద్యోగా ల కల్పన, స్వయంఉపాధి అవకాశాలను పెంపొందించడం బ్యాంకులతోనే సాధ్యమవుతాయని, జీవనోపాధిని పెంపొందిస్తాయని వివరించారు. పీఎంసీ బ్యాంకు, ఎస్‌ బ్యాంకు స్కాం నేపథ్యం లో సహకార బ్యాంకులపై ఆర్‌బీఐకి మరింత అధికారాలు కల్పించడం స్వాగతించాల్సిన పరిణామ ని చెప్పారు. సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులతో సమానంగా రాణించాలంటే మంచి యాజమాన్యం, సరైననిర్వహణ ఉంటే సాధ్యమవుతుందన్నారు. అన్ని బ్యాంకులను ఎప్పటికప్పు డు అడిట్‌ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.


logo