బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 01:51:54

కెనడా ప్రధాని భార్యకు కరోనా నిర్ధారణ

కెనడా ప్రధాని భార్యకు కరోనా నిర్ధారణ

అట్టావా: ఇటీవల బ్రిటన్‌ ఆరోగ్యమంత్రికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, తాజాగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో భార్య సోఫి గ్రెగొరీకి ఆ వైరస్‌ సోకినట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం గురువారం ప్రకటించింది. ట్రుడో దంపతులు ఒక కార్యక్రమంలో ప్రసంగించి వచ్చిన తర్వాత.. గ్రెగొరీలో ఫ్లూ లక్షణాలు బయటపడటంతో పరీక్షలు జరుపామని, దీంతో ఆమెకు కరోనా సోకినట్టు తేలిందని వెల్లడించింది. కాగా, తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొన్న ప్రధాని ట్రుడో.. ఐసోలేషన్‌ వార్డు నుంచే విధుల్ని నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు కెనడాలోని ఆరు రాష్ర్టాల్లో 150 కరోనా కేసులు నమోదవ్వగా, ఒకరు చనిపోయారు. 


logo
>>>>>>