గురువారం 28 మే 2020
Telangana - May 02, 2020 , 12:19:52

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి ప్రమాణం

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం హైకోర్టులో జరిగింది. విజయసేన్‌ రెడ్డి నియామకంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 14కు చేరింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు బీ కృష్ణమోహన్‌, కే సురేశ్‌ రెడ్డి, కే లలితకుమారి ప్రమాణస్వీకారం చేశారు. 

పిపిఆర్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్‌ఎల్‌బి పట్టా పొందారు. విజయసేన్ రెడ్డి 1994 లో ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. హైకోర్టులో కేసులను తీసుకునే ముందు సబార్డినేట్ కోర్టులు మరియు ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు విజయసేన్ రెడ్డి.

విజయసేన్ రెడ్డి 25 సంవత్సరాలకు పైగా వివిధ శాఖలలో ప్రాక్టీస్ చేశాడు. విజయసేన్ రెడ్డి తండ్రి దివంగత బి. సుభాషన్ రెడ్డి మద్రాస్, కేరళ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. సుభాషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్ గా సేవలందించారు.


logo