సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 02, 2020 , 01:19:37

సామాజిక న్యాయానికి కేసీఆర్‌ పెద్దపీట

సామాజిక న్యాయానికి కేసీఆర్‌ పెద్దపీట
  • ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రిజర్వేషన్లు లేకున్నా అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్దేశమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ క్రమంలోనే డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల్లో దాదాపు 50శాతం బడుగు, బలహీనవర్గాలకు అవకాశం కల్పించామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిభింబించే పనిచేయడంతోపాటు సమాజంలోని అన్నివర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా చేయాలనేది తమ పార్టీ లక్ష్యమని వివరించారు. ఇప్పటికే తాము మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల కన్నా ఎక్కువగా పదవుల్లో అవకాశం ఇచ్చామని చెప్పారు. పాలనలో, పదవుల్లో బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తున్న పార్టీగా టీఆర్‌ఎస్‌ నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌    ఎస్‌ను ఆశ్వీరదిస్తున్న     ప్రజలకు ధన్యవాదాలు     తెలిపారు.


logo