రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్ హిమ ప్రమాణం

- ప్రస్తుతం దేశంలోనే ఏకైక మహిళా సీజే
- గవర్నర్, ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందన
- తొలి కేసుగా జల్పల్లి వరద నీటి అంశం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లీ గురువారం ప్రమాణం స్వీకరించారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమెను అభినందించారు. తెలంగాణ హైకోర్టు ఏర్పడిన తర్వాత ఒక మహిళ సీజే కావటం ఒక విశేషమైతే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో ఏకైక మహిళా సీజే జస్టిస్ హిమాకోహ్లీయే కావటం మరో విశేషం. తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ కాకుండా.. 13 మంది న్యాయమూర్తులున్నారు. వారిలో జస్టిస్ శ్రీదేవి ఒక్కరే మహిళా న్యాయమూర్తి. జస్టిస్ హిమాకోహ్లీ ప్రమాణంతో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరింది.
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లీ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గురువారం ఉదయం 11.50 గంటలకు గవర్నర్ తమిళిసైసౌందర్‌రాజన్ జస్టిస్ హిమాకోహ్లీతో ప్రమాణం చేయించారు. చీఫ్ జస్టిస్‌గా నియమిస్తూ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను ఆమెకు గవర్నర్ అందజేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చీఫ్ జస్టిస్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన తర్వాత చీఫ్ జస్టిస్ అయిన తొలి మహిళగా హిమాకోహ్లీ గుర్తింపు పొందారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీ జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, పువ్వాడ అజయ్‌కుమార్, వీ శ్రీనివాస్‌గౌడ్, సీ మల్లారెడ్డి, మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జీ చంద్రయ్య, హైకోర్టు న్యాయమూర్తులు ఎంఎస్ రామచంద్రారావు, ఏ రాజశేఖర్‌రెడ్డి, పీ నవీన్‌రావు, చల్లా ,కోదండరాం, అభినందన్‌కుమార్ షావిలి, అమర్నాథ్గౌడ్, శ్రీదేవి, వినోద్‌కుమార్, అభిషేక్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి, ఏజీ బీఎస్ ప్రసాద్, న్యాయశాఖకార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
25 హైకోర్టుల్లో ప్రస్తుతం కోహ్లీ ఒక్కరే మహిళా సీజే
దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు ఉండగా ప్రస్తుతం హిమాకోహ్లీ ఒక్కరే మహిళా చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. ఆమె తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణం చేసే వరకు అన్ని హైకోర్టులకు పురుషులే చీఫ్ జస్టిస్‌లుగా ఉండటం గమనార్హం. తెలంగాణ హైకోర్టు విషయానికి వస్తే చీఫ్ జస్టిస్ కాకుండా.. 13 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వారిలో జస్టిస్ శ్రీదేవి ఒక్కరే మహిళా న్యాయమూర్తి. చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ ప్రమాణంతో హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరింది.
సీజేకు సీఐఐ అభినందనలు
సీజేగా ప్రమాణం స్వీకరించిన హిమాకోహ్లీని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తెలంగాణ విభాగం ఛైర్మన్ కృష్ణ బోదనపుతోపాటు సీఐఐ సభ్యులు అభినందించారు. పారిశ్రామికవర్గాలకు నూతన చట్టాలు, సవరణలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో అవగాహన కల్పించటానికి తాము న్యాయవ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు పేర్కొన్నారు. తొలి మహిళా జస్టిస్‌గా కోహ్లీ నియామకం అభినందనీయమని సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ విభాగం చైర్పర్సన్ కే స్వాతి పేర్కొన్నారు.
తొలి కేసుగా జల్పల్లిపై విచారణ
హైదరాబాద్ శివారులోని జల్పల్లి మున్సిపాలిటీ వరద సమస్యను రెండువారాల్లో పరిష్కరించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ అధికారులను ఆదేశించారు. గురువారం తొలి కేసుగా ఈ వరద సమస్య పిటిషన్లపై ఆమె విచారించారు. ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేదానిపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్, షాహీన్‌నగర్‌లో వర ద జలాలు నిలిచి ఉండటంతో పలుకాలనీలు నీటిలో మునిగిపోయాయని, వరద జలాలను తొలిగించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. వరద తొలగింపు పేరుతో బాలాపూర్ మండ లం వెంకటాపూర్ సమీపంలోని బుర్హాన్‌ఖాన్ చెరువులో నీటిని మొత్తం తొలిగిస్తున్నారని, దీంతో అందులోని చేపలకు నష్టం కలుగుతున్నదని ఆ గ్రామ మత్స్య సహకార సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం చుట్టుపక్కల కాలనీలకు ఇబ్బంది కాకుండా దశలవారీగా వరద సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.
తాజావార్తలు
- వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు
- అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- వుయ్ షుడ్ నెవర్ వేస్ట్ గుడ్ క్రైసిస్: హీరో చైర్మన్
- ‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్
- ఎనీ బుక్ @ ఇంటర్నెట్
- కార్పొరేట్‌కు దీటుగా నేత కార్మికులు ఎదగాలి
- గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
- ‘పల్లె ప్రగతి’తో సత్ఫలితాలు
- కొత్త హంగులతో కోట
- బడులు సిద్దం చేయాలి