శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 01:56:57

చిన జీయర్‌స్వామికి మాతృ వియోగం

చిన జీయర్‌స్వామికి మాతృ వియోగం

  • రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో అంత్యక్రియలు

శంషాబాద్‌: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి రామానుజన్‌ చినజీయర్‌ స్వామికి మాతృవియోగం కలిగింది. చినజీయర్‌ తల్లి ఆచార్య శ్రీ అలివేలు మంగతాయారు (85) హైదరాబాద్‌లోని నారాయణగూడలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలివేలు మంగతాయారుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో చినజీయర్‌ పెద్ద కుమారుడు. తల్లి ఆదేశానుసారమే చినజీయర్‌ సన్యాసం స్వీకరించారు. రం గారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ పరిధిలోని శ్రీరామనగరం సమీపంలో చినజీయర్‌ స్వీయ పర్యవేక్షణలో మంగతాయారు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆమె పార్థివదేహాన్ని భక్తుల దర్శనార్థం జిమ్స్‌ కళాశాలలో ఉం చారు. అంత్యక్రియల్లో మైహోం సంస్థల అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు, ఎండీ జూపల్లి జగపతిరావు, వారి కుటుంబసభ్యులు, పలురంగాల ప్రముఖులు పాలుపంచుకున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు అంతిమయాత్రలో పరిమితంగా భక్తులు పాల్గొన్నారు.


logo