ఆదివారం 31 మే 2020
Telangana - May 01, 2020 , 17:26:12

రాచకొండ పోలీసులకు వాటర్‌ కూలర్స్‌ విరాళం

రాచకొండ పోలీసులకు వాటర్‌ కూలర్స్‌ విరాళం

హైదరాబాద్‌ : రాచకొండ పోలీసులకు జూబ్లీహిల్స్‌ రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ మూర్తి వాటర్‌ కూలర్స్‌ను విరాళంగా ఇచ్చారు. ఈ వాటర్‌ కూలర్స్‌ను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు మూర్తి అందజేశారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద  కూలర్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. యాప్రాల్‌కు చెందిన డాక్టర్‌ అనిల్‌ కుమార్‌.. 1000 ఫేస్‌ షీల్డ్స్‌తో పాటు శానిటైజర్స్‌ను మహేశ్‌ భగవత్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత, అడిషనల్‌ డీసీపీ శిల్పవల్లి పాల్గొన్నారు.logo