శనివారం 04 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:41

జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేయాలి

జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేయాలి

  • మంత్రి ఈటలను కోరిన మీడియా అకాడమీ చైర్మన్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జర్నలిస్టులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ కోరారు. ఈ మేరకు సోమవారం బీఆర్కేభవన్‌లో మంత్రికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. టీవీ-5 రిపోర్టర్‌ మనోజ్‌కుమార్‌ కరోనాతో మరణిం చారని తెలిపారు.ప్రతి జర్నలిస్టుకు కరోనా కిట్‌ (మాస్క్‌, శానిటైజర్‌, పీపీఈ కిట్‌, గ్లౌజ్‌) ఇవ్వాలని కోరారు. హెల్త్‌ కార్డులతో కార్పొరేట్‌ దవాఖానల్లో అన్ని ఆరోగ్య సమస్యలకు వైద్యం అందేలా, టెస్టులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు రూ.20 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని కోరారు. జర్నలిస్టులకు కరోనా టెస్టులకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.  మంత్రిని కలిసినవారిలో టీయూడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్‌, తెమ్జూ అధ్యక్షుడు ఇస్మాయిల్‌, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు, జర్నలిస్టు సంఘాల నేతలు ఉన్నారు.


logo