గురువారం 28 మే 2020
Telangana - May 19, 2020 , 00:46:15

జర్నలిస్టులను ఆదుకోండి

జర్నలిస్టులను ఆదుకోండి

  • సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కష్టకాలంలో జర్నలిస్టులను ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) సీఎం కేసీఆర్‌ను కోరింది. ఈ మేరకు సోమవారం సంఘం ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్‌, చిన్నపత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్‌బాబు తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కొన్ని సంస్థల్లో యాజమాన్యాలు వేతనాల్లో కోత విధించడం వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాగా, మీడియా చైర్మన్‌ అల్లం నారాయణతో మాట్లాడి జర్నలిస్టులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు సంఘం నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.logo