బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 20:38:32

కరోనాతో మృతిచెందిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేసిన పాత్రికేయుడు..

కరోనాతో మృతిచెందిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేసిన పాత్రికేయుడు..

భద్రాద్రి కొత్తగూడెం: కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నాడు ఓ పాత్రికేయుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన బీజేపీ నాయకుడు కుటుంబరావు కరోనాతో చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం దవాఖానలో మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని ఇల్లందు తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఇల్లందు పాత్రికేయుడు ఉదయ్ తనకున్న పరిచయాలతో మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశాడు.

తీరా మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు అందరూ భయపడుతున్న సమయంలో ఉదయ్‌  పీపీయి కిట్ ధరించి వాహనం నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చాడు. అతడి స్ఫూర్తితో మరికొందరు ముందుకువచ్చారు. అందరూ కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉదయ్‌ని పలువురు ప్రశంసించారు.


logo