బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 12:09:58

ప్రముఖ జర్నలిస్ట్‌ పొత్తూరి కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్‌ పొత్తూరి  కన్నుమూత

హైదరాబాద్‌ : ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. 1957లో ఆంధ్రజనత ద్వారా పాత్రికేయరంగంలోకి ప్రవేశించి తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. అన్ని ప్రముఖ పత్రికలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ, ఉదయం, వార్తా పత్రికల్లో పనిచేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా ఆయన సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. డాక్టర్‌ పొత్తూరిగారి రచనలు.. ఆధ్యాత్మిక సంపాదకీయాల సంకలనం చింతన. స్ఫూర్తిగా నిలిచిన మహనీయుల మీద వ్రాసిన సంకలనం చిరస్మరణీయులు. తెలుగులో ఏ పత్రికలు ఏయే భావాలతో పుట్టాయో, ఏ ప్రత్యేకతలు సంతరించుకున్నాయో తెలిపే రచన నాటి పత్రికల మేటి విలువలు. పారమార్థిక పదకోశం, వ్యాస ప్రభ వంటి తదితర రచనలు చేశారు. 


logo