Telangana
- Sep 26, 2020 , 03:18:25
VIDEOS
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీకి..అక్టోబర్ 9న ఉప ఎన్నిక

నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ తేదీ ఖరారైంది. అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది. 12న కౌంటింగ్ నిర్వహించనున్నది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఈసీ తాజా నిర్ణయంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, విత్‌డ్రా ప్రక్రియ ఇదివరకే ముగియగా, ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ పార్టీ నుంచి వడ్డేపల్లి సుభాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి పోతన్కర్ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో 824 మందికి ఓటు హక్కు ఉన్నది.
తాజావార్తలు
MOST READ
TRENDING