గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 22:12:58

నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరికలు..

నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరికలు..

హైదరాబాద్ :  జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  నాచారం డివిజన్ ఎన్నికల ఇన్‌చార్జి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అధ్వర్యంలో శనివారం స్థానిక సీకేగార్డెన్‌లో టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ఇన్‌చార్జీలతో ఎన్నికల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా డివిజన్‌ స్థాయి బీజేపీ ముఖ్య నాయకుడు సాయికృష్ణ, కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు జాకీర్, సామాజిక కార్యకర్త శంకర్‌తోసహా వందలాది మంది పలు పార్టీల కార్యకర్తలు మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి దక్కకపోవడంతో రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చిల్లా పద్మావతి అశోక్ ముదిరాజ్‌ను బుజ్జగించి పార్టీ సమావేశానికి రప్పించడంలో మంత్రితోపాటు ఎమ్మెల్యేలు సుభాశ్‌, వెంకటరమణారెడ్డి సఫలీకృతులయ్యారు. 

దేవేందర్‌రెడ్డిని గెలిపించాలి..

అంతకుముందు మల్లాపూర్ డివిజన్‌లో వీఎన్‌ఆర్‌ గార్డెన్స్ లో  టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీల ఇన్‌చార్జి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం పార్టీ అభ్యర్థులు, నాయకులు అనుసరించాల్సిన వ్యూహాంపై దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి దేవేందర్ రెడ్డిని గెలిపించే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ ఇన్‌చార్జీలదేనని అన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.