వెంకటాపురం డివిజన్లో టీఆర్ఎస్లో చేరికలు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని వెంకటాపురం డివిజన్లో బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావుతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత భాస్కర్, యూత్ లీడర్ ప్రవీణ్ కుమార్ తమ అనుచరులతో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి టీఆర్ఎస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరున్నరేండ్ల టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ మహానగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని అన్నారు. మరోసారి బల్దియాపై గులాబీ జెండా ఎగిరితే నగరం మరింత ప్రగతి పథాన పయనిస్తుందని పేర్కొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో రూ. 550కోట్ల అభివృద్ధి పనులు చేశామని, మరో రూ. 50కోట్ల పనులు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల వేళ కొన్నిఓట్లు.. సీట్ల కోసం బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తుందని మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు