గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 12, 2020 ,

టీఆర్‌ఎస్‌లో చేరికల జోరు

టీఆర్‌ఎస్‌లో చేరికల జోరు

టీఆర్‌ఎస్‌లోకి చేరికలు జోరందుకున్నాయి. శనివారం కూడా ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరారు. మహబూబ్‌నగర్‌లోని 46వ వార్డుకు చెంది న వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: టీఆర్‌ఎస్‌లోకి చేరికలు జోరందుకున్నాయి. శనివారం కూడా ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరారు. మహబూబ్‌నగర్‌లోని 46వ వార్డుకు చెంది న వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఉప సర్పంచ్‌ శివరాత్రి సుధాకర్‌, వార్డు సభ్యు డు కిష్టంరాజు జ్యోతి నాగరాజు, యూత్‌ అధ్యక్షుడు ఆలకుంట్ల ఉపేందర్‌తోపాటు సుమారు 50 మంది పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కొత్తపల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్‌ నాయకులు చెట్టిపల్లి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో వంద మందికిపైగా కార్యకర్తలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుంగుల కమలాకర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.


logo