గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 18:08:00

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిక

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిక

వికారాబాద్‌ : టీఆర్‌ఎస్‌లోకి  వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా..మోమిన్‌పేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆ పార్టీ వీడి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం వికారాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోమిన్‌పేట మండలం పాత కోల్కుంద గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే ఆనంద్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వీరిలో ఎం ఆశోక్‌, రాంచంద్రయ్య, ఆశయ్య, మల్లయ్య, శ్రీనివాస్‌, బుచయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నామని అన్నారు. కార్యక్రమంలో మోమిన్‌పేట్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అంజిరెడ్డి, వికారాబాద్‌ మండల పార్టీ అధ్యక్షుడు కమల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.