గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 15:41:54

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిక

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిక

కామారెడ్డి : టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చాట్ల రాజేశ్వర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాద్ లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్  ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణు గోపాల్ రావు, ఎంపీపీ లోయలపల్లి నర్సింగరావు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి,  కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


logo