గురువారం 09 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 03:03:39

ఆరోగ్య తెలంగాణను ప్రసాదించు తల్లీ : మంత్రి నిరంజన్‌రెడ్డి

ఆరోగ్య తెలంగాణను ప్రసాదించు తల్లీ : మంత్రి నిరంజన్‌రెడ్డి

అలంపూర్‌: ‘రాష్ర్టాన్ని, దేశాన్ని కాపాడి.. ఆరోగ్య తెలంగాణను ప్రసాదించు తల్లీ’.. అని జోగుళాంబ అమ్మవారిని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దంపతులు వేడుకున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులో భాగంగా సోమవారం నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించడంతో మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకొని.. సీఎం కేసీఆర్‌ దంపతుల పేరిట అర్చన చేయించారు. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అక్కడి సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించి, శానిటైజర్‌ అందజేశారు. దర్శనం తరువాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రానున్న తుంగభద్ర పుష్కరాల విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.logo