బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 19:37:20

ఫిబ్ర‌వ‌రి నుండి ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ : సీఎం కేసీఆర్

ఫిబ్ర‌వ‌రి నుండి ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాల‌ని అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఖాళీల అధ్యయనానికి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని సీఎం నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటివారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేయ‌నుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది.


logo