మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 02:09:35

నైపుణ్య శిక్షణతో ఉద్యోగావకాశాలు

నైపుణ్య శిక్షణతో ఉద్యోగావకాశాలు

దళిత నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమం

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రాంతాల యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశా లు కల్పించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని నైపుణ్య శిక్షణ సంస్థల ప్రతినిధులు, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులతో శుక్రవారం సంక్షేమభవన్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇతర రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని దళిత యువతకు విద్యార్హతలను బట్టి ఆయారంగాల్లో శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ లచ్చిరాం భూక్య, ఎన్‌ఏసీ, ఎన్‌ఎస్‌సీ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.logo