శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 08:47:40

మల్లేపల్లి ఐటీఐలో రేపు జాబ్‌మేళా

మల్లేపల్లి ఐటీఐలో రేపు జాబ్‌మేళా

హైదరాబాద్‌: రంగారెడ్డి,హైదరాబాద్‌ జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల ఆధ్వర్యంలో ఈ నెల 25న జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. నగరంలోని ప్రధాన సంస్థ అయిన క్యాలిబర్‌ హెచ్‌ఆర్‌ సంస్థలో టెలీకాలర్స్‌, కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌, బ్రాంచీ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌, టీం లీడర్స్‌ తదితర ఉద్యోగాల కోసం జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి ఎన్‌ మైత్రిప్రియ తెలిపారు. 100 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాలో 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు గల, ఎంబీఏ, బీటెక్‌, డిగ్రీ, ఇంటర్మీడియట్‌ విద్యార్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావొచ్చని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.12వేల నుంచి రూ.18వేల వరకు వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 25న ఉదయం విజయనగర్‌ కాలనీలోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరుకావాలని పేర్కొన్నారు. వివరాలకు యంగ్‌ ప్రొఫెషనల్‌ టి రఘుపతి, 8247656356 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

VIDEOS

logo