Telangana
- Jan 06, 2021 , 01:58:29
‘కేదార్కాంత’పై జేఎన్టీయూ విద్యార్థులు

- 12,500 అడుగుల ఎత్తున జాతీయ జెండా
వలిగొండ, జనవరి 5: ఉత్తరాఖండ్‌లోని 12,500 అడుగుల ఎత్తున్న కేదార్కాంత పర్వతాన్ని అధిరోహించిన జేఎన్టీయూ విద్యార్థులు జాతీయ జెండా ఎగురవేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన సలిగంజి గౌతమ్ కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన మిత్రబృందం నరేశ్, అఖిల్, నిఖిల్, సాయితో కలిసి డిసెంబర్ 31న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్కాంత పర్వతారోహణకు బయలుదేరారు. జనవరి 1న 12, 500 అడుగుల ఎత్తున్న కేదార్కాంత పర్వతంపైకి చేరుకొని, జాతీయ జెండాను రెపరెపలాడించారు.
తాజావార్తలు
MOST READ
TRENDING