ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 16:24:52

జేఎన్‌టీయూ బీటెక్‌, బీఫార్మా, ఎంబీఏ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

జేఎన్‌టీయూ బీటెక్‌, బీఫార్మా, ఎంబీఏ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

హైద‌రాబాద్ : జ‌వ‌హార్‌లాల్ నెహ్రు టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ, హైద‌రాబాద్‌(జేఎన్‌టీయూ-హెచ్‌) బీటెక్‌, బీ ఫార్మా, ఎంబీఏ ఫైన‌ల్ ఇయ‌ర్ సెకండ్ సెమిస్ట‌ర్‌ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుండి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 16, 18, 21, 23, 25 తేదీలలో బీటెక్‌, బీఫార్మా ఫోర్త్ ఇయ‌ర్ సెకండ్ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు అదేవిధంగా ఎంబీఏ సెకండ్ ఇయ‌ర్ సెకండ్ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్లు జేఎన్‌టీయూ-హెచ్ వెల్ల‌డించింది. 

బీటెక్‌, బీఫార్మా, ఎంబీఏ కోర్సుల్లోని ప‌లు విభాగాల‌కు సంబంధించిన సెకండ్ ఇయ‌ర్ సెకండ్ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు ఉద‌యం 10.30 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. బీటెక్‌లో ఎల‌క్ర్టిక‌ల్‌, ఎల‌క్ర్టానిక్స్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌, ఐటీ విభాగాల‌కు మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌. ముందే నిర్ణయించినట్లు పరీక్ష వ్యవధిని మూడు గంటల నుండి రెండు గంటలకు తగ్గించారు. ఈ మేర‌కు ప్రశ్నపత్రాన్ని ఎనిమిది ప్రశ్నలకు గాను ఐదుగా మార్చి పార్ట్-ఎను తొలగించారు. 


logo