గురువారం 09 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 16:28:48

టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిన్ పింగ్ దిష్టి బొమ్మ దహనం

టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిన్ పింగ్ దిష్టి బొమ్మ దహనం

హైదరాబాద్ : భారత్, చైనా సరిహద్దులో ఘర్షణలో వీర మరణం పొందిన తెలంగాణ ముద్దు బిడ్డ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు మృతికి నిరసనగా   టీఆర్ ఎస్వీ రాష్ట్ర నాయకులు రవికిరణ్‌, నెమ్మాది శ్రావణ్‌ కుమార్ఆ ధ్వర్యంలో  హైదరాబాద్ లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా చైనా వస్తువులను కొనరాదని, ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మను టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దహనం చేశారు. బై మేడ్ ఇన్ ఇండియా, బాయ్ కాట్ మేడ్ ఇన్ చైనా నినాదాలతో చైనాకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు తరుణ్‌, అర్షిత్ రోహిత్, విష్ణు, సాయి మానస్ తదితరులు పాల్గొన్నారు.


logo