సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:44:06

సాఫీగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు

సాఫీగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ /తిమ్మాపూర్‌ /ఖమ్మం ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో జేఈఈ మెయిన్‌ పరీక్షలు మంగళవారం సాఫీగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండతోపాటు రంగారెడ్డి జిల్లాలోనూ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. మొదటి రోజు పరీక్షకు  రాష్ట్రం నుంచి అతి తక్కువ సంఖ్యలో పరీక్షలకు హాజరైనట్టు సమాచారం. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 6 వరకు జేఈఈ బీటెక్‌ విభాగంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యార్థులందరూ తమ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 


logo