శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 06:42:31

మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరుగనున్నది. ఈ మేరకు సరిచేసిన షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజె న్సీ (ఎన్టీయే) అధికారులు విడుదల చేశారు. జేఈఈ మెయిన్‌లో ర్యాంకు సాధించినవారు మే ఒకటి నుంచి ఆరు వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్‌ కార్డులు మే 12 నుంచి 17 వరకు పొందవచ్చు. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌లలో పరీక్ష కేంద్రా లు ఏర్పాటుచేశారు. 


logo