మంగళవారం 02 జూన్ 2020
Telangana - Jan 31, 2020 , 01:13:49

జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జనసేన పార్టీకి మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు రాజీనామా లేఖను పంపారు. ‘పూర్తిజీవితం ప్రజాసేవకే అని, సినిమాల్లో నటించనని మీరు (పవన్‌కల్యాణ్‌) పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తున్నది. కావున, నేను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను’ అని లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. విశాఖ పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు ఓటువేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.


logo