గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 14:38:19

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో  పెద్దపులి సంచారం!

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహముత్తతారం మండలం యామ న్ పల్లి గ్రామ సమీపంలోని కమ్మరి బాలయ్య ఒర్రే వద్ద పెద్దపులి అడుగులను గ్రామస్తులు ఆదివారం ఉదయం గుర్తించారు. దీంతో గ్రామస్తులు సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.   హూటా హుటిన అటవీ శాఖ సిబ్బంది  అక్కడికి చేరుకొని పెద్ద పులి అడుగుల నమూనాలు సేకరించి కొలతలు తీసుకున్నారు.

శనివారం రోజు పక్కనే వున్న గిరిజన గ్రామం నిమ్మగుడెంలోని అడవిలో గ్రామానికి చెందిన నల్లగుంట సమ్మయ్య దుక్కిటెద్దును పెద్దపులి చంపిన కళేబరాన్ని చూశామని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా, పులి అడుగుల గురించి ఆజంనగర్ ఫారెస్ట్ ఇంచార్జి రేంజర్ అదిల్ ను వివరణ కోరగా.. అవి పెద్ద పులి అడుగుల మాదిరిగానే ఉన్నాయని, కనిపించిన అడుగులను ఫోటోలు తీసి, ఎక్స్పర్ట్ వైల్డ్ లైఫ్ అధికారులకు పంపించాచమని  తెలిపారు. గ్రామస్తులు, పశువుల కాపరులు అటువైపు వెళ్ల కూడదని సూచించారు. పులి తమపై ఎక్కడ దాడి చేస్తుందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.logo