ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 13:39:56

జయశంకర్ కలలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్ : మండలి చైర్మన్ గుత్తా

జయశంకర్ కలలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్ : మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతిని నిర్వహించారు. చిట్యాల మున్సిపాలిటీ  కార్యాలయంలో ఫ్రొపెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పూలమాల వేసి నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే ఊపిరిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆనాడు జయశంకర్ సార్ తోడుగా నిలిచారన్నారు. 

సమైక్య పాలనలో అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఎలా అభివృద్ధి చెందాలో జయశంకర్ కలలు కన్నారని తెలిపారు. ఆచార్య జయశంకర్ కలలు కన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించి చూపించారని చెప్పారు. జయశంకర్ ఎలాంటి బంగారు తెలంగాణ కావాలి అనుకున్నారో.. అదే విధంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. 


logo