సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 03:11:34

ఉగ్రదాడిలో ఆర్మీ జవాన్‌ మృతి

ఉగ్రదాడిలో ఆర్మీ జవాన్‌ మృతి

  • పెద్దపల్లి జిల్లా నాగేపల్లిలో విషాదం 

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: జమ్ముకశ్మీర్‌లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో తెలంగాణకు చెందిన జవాను సాలిగం శ్రీనివాస్‌ (28) వీరమరణం పొందారు. బారాముల్లాలోని పఠాన్‌ ప్రాంతంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఉగ్రవాదుల దాడి జరిగిందని.. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో శ్రీనివాస్‌ ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే మరణించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లికి చెందిన సాలిగం నారాయణ కుమారుడు శ్రీనివాస్‌ 2013లో ఆర్మీలో చేరారు. లాక్‌డౌన్‌కు ముందు సెలవుపై వచ్చిన శ్రీనివాస్‌ జూన్‌ 6న కశ్మీర్‌కు తిరిగి వెళ్లారు. శ్రీనివాస్‌ మరణవార్త విని ఆయన భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 


logo