బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 21:10:42

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి జవాన్‌కు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి జవాన్‌కు గాయాలు

కొత్తగూడెం క్రైం : ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు పాతిన మందుపాతర పేలిన ఘటనలో జవానుకు గాయాలైన సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో డీఆర్‌జీ, సీఏఎఫ్‌ భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చింగ్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోన బుర్జి - పూసునార్‌ గ్రామల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాలను టార్గెట్‌ చేస్తూ పాతిన మందుపాతరపై జవాన్‌ కాలు వేయడంతో అది భారీ విస్పోటనం చెందింది. ఈ ఘటనలో సీఏఎఫ్‌ 19బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ రితేశ్‌ పటేల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి జవాన్లు క్షతగాత్రుడికి బీజాపూర్‌ జిల్లా కేంద్రంలో ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం రితేశ్‌ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.  


logo