బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 21:15:45

తుపాకీతో కాల్చుకొని జవాన్‌ ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకొని జవాన్‌ ఆత్మహత్య

ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో నారాయణపూర్‌ జిల్లా ఓర్చా పోలీస్‌ క్యాంపులో విషాద సంఘటన చోటు చేసుకుంది.  తన వద్ద ఉన్న తుపాకీతో ఓ పోలీస్‌ జవాన్‌ కాల్చుకొని అత్మహత్య చేసుకున్నాడు.  సీఏఎఫ్‌ భద్రతా బలగాలకు చెందిన జవాన్‌ అనిల్‌ యాదవ్‌ విధులు నిర్వహిస్తున్న క్యాంపులోనే ఈ చర్యకు పాల్పడటంతో తోటి జవాన్లు, సీఏఎఫ్‌ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ఆత్మహత్య సంఘటనని సీఏఎఫ్‌ ఏఎస్పీ జయంతి వైష్ణవ్‌ ధ్రువీకరించారు. జవాన్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఘటనలు పలు సందర్భాల్లో జరుగుండటంతో ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.logo
>>>>>>