శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 00:07:47

అనువాదం అమోఘం

అనువాదం అమోఘం

బహు భాషా కోవిదుడు పీవీ నరసింహారావు అనేది తెలిసిన విషయమే. ఆయన గొప్ప నేతల ప్రసంగాల అనువాదకుడిగా ప్రశంసలు పొందారు. తర్జుమా చేయడంలోనూ దిట్టగా పేరొందారు. ప్రథమ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రసంగాలను పీవీ తెలుగులోకి అనువదించేవారు. ఆ నైపుణ్యంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అభిమానాన్ని చూరగొన్నారు. రాష్ట్రంలో పర్యటించిన ప్రతి సందర్భంలోనూ ఇందిరాగాంధీ ఇంగ్లిషు ఉపన్యాసాన్ని పీవీ నరసింహారావు తెలుగులోకి తర్జుమా చేసేవారు. ప్రధాని ఇందిరాగాంధీ భావాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా ఆకర్షణీయంగా, స్పష్టంగా.. సూటిగా పీవీ అనువదించేవారు. అందువల్లే పీవీ తర్జుమాను ఇందిరాగాంధీ ఇష్టపడేవారు. అలా ప్రధానితో సాన్నిహిత్యం పెరిగింది. 

అలాగే ఏపీలో పర్యటించిన సరిహద్దు ఖాన్‌ గఫార్‌ఖాన్‌ ఉపన్యాసాలను సైతం పీవీనే అనువదించి ప్రజలకు వివరించేవారు. అలాగే హిందీ, తెలుగు, మరాఠి, ఇంగ్లిష్‌ భాషలలోని ప్రముఖుల పుస్తకాలను, గజల్స్‌ను, కవితలను కూడా తర్జుమా చేసిన పండితులు పీవీ నర్సింహారావు. ఇవిగాకుండా అనేకానేక గజల్స్‌ను, పాటలను కూడా పీవీ తర్జుమా చేశారు.


logo