మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 17:26:57

సీఎంఆర్ఎఫ్ కు జపాన్ తెలుగు సమాఖ్య రూ.3.5 లక్షల విరాళం

సీఎంఆర్ఎఫ్ కు జపాన్ తెలుగు సమాఖ్య రూ.3.5 లక్షల విరాళం

హైదరాబాద్ : కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసం నుంచి నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి సహాయ నిధికి జపాన్ తెలుగు సమాఖ్య రూ. 3.5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు చెక్కును  సమాఖ్య ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కలిసి మినిస్టర్స్ క్వార్టర్స్ లో అందజేశారు. కరోనా వైరస్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న వారికి సాయంగా విరాళాన్ని అందజేస్తున్నట్లు సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధి మురళీధర్ ఫోన్ద్వా రా వినోద్ కుమార్ తో మాట్లాడారు.


logo