గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 24, 2020 , 17:29:55

జాన్‌పాడు దర్గా గంధం ఉరేగింపులో పాల్గొన్న హోమంత్రి

జాన్‌పాడు దర్గా గంధం ఉరేగింపులో పాల్గొన్న హోమంత్రి

సూర్యపేట: జిల్లాలోని పాలకీడు మండలం జాన్‌పాడు దర్గా ఉరుసు ఉత్సవాలు గంధం ఊరేగింపులో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమంత్రి మాట్లాడుతూ... జానపాడు దర్గా అభివృద్ధికి సీఎం కేసీఆర్ అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని శాఖల వారిని సమన్వయ చేశాం. మతసామరస్యం చాటేలా జాన్‌పాడు ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు జాన్‌పాడు సైదులు దర్గా దర్శించుకోవడం జరుగుతుంది. జాన్‌పాడు సైదులు దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.  తెలంగాణ ప్రజలకు జాన్‌పాడు సైదులు స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను.  సీఎం కేసీఆర్ జాన్‌పాడు దర్గా పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు.


ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ... జాన్‌పాడు దర్గా ఉత్సవాలు గతం లో కంటే ప్రస్తుతం ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్గాకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్తి స్థాయిలో  ఏర్పాట్లు నిర్వహించాం. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్‌పాడు సైదులు దర్గా ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. జాన్‌పాడు సైదులు స్వామిని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో  ప్రశాంతంగా దర్శించుకునే  విధంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు అని అన్నారు. రెండు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో భక్తులు తరలి రావడం జరుగుతుందని. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం.  అత్యధిక నిధులు కేటాయించి ధర్గాను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు..


logo