ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 06:25:56

రాష్ట్రంలో ప్రారంభమైన జనతా కర్ఫ్యూ

రాష్ట్రంలో ప్రారంభమైన జనతా కర్ఫ్యూ

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. ప్రధాని మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూతో కరోనాపై భారతావని యుద్ధం ప్రకటించింది. నేడు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్‌ పాటిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిస్తుండగా తెలంగాణలో మాత్రంలో సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు ప్రజలు 24 గంటల పాటు జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూ రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అత్యవసర సేవలు అందించే సిబ్బందితో పాటు వైద్యులకు సంఘీభావంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాల్సిందిగా పీఎం, సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 వేల మంది పోలీసులు, 11 వేల మంది హోంగార్డులు జనతా కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.


logo