బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 09:21:24

ఇళ్లకే పరిమితమైన ఉమ్మడి వరంగల్‌ ప్రజానీకం

ఇళ్లకే పరిమితమైన ఉమ్మడి వరంగల్‌ ప్రజానీకం

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రజానీకం ఇళ్లకే పరిమితమయ్యారు. 9 డిపోల పరిధిలోని 960 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆటోలు సైతం బంద్‌లో పాల్గొన్నాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, చికెన్‌, మటన్‌ దుకాణాలను మూసివేశారు. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జనతా కర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.


logo
>>>>>>