శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 11:01:57

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ

నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతుంది. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, మల్లేపల్లి, హాలియా, నార్కట్‌పల్లి, ఇలా ప్రతి ప్రధాన పట్టణంలో పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతుంది. టోల్‌ప్లాజాల వద్ద ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద బయటి ప్రాంత వాహనాలను నిలిపివేశారు. సూర్యాపేటలోని తన క్యాంప్‌ కార్యాలయం నుండి మంత్రి జగదీష్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కరోనా నిరోధానికి సీఎం కేసీఆర్‌ అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లతో ఐక్యతను చాటుదామని మంత్రి పేర్కొన్నారు.

logo