బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 12:26:01

జ‌న‌గామ‌లో వీధుల‌న్నీ నిర్మానుషం..

జ‌న‌గామ‌లో వీధుల‌న్నీ నిర్మానుషం..

హైద‌రాబాద్‌ : జ‌న‌గామ జిల్లా కేంద్రంలో ప్ర‌జ‌లు జ‌న‌తా క‌ర్ఫ్యూను పాటించారు.  క‌రోనా వైర‌స్‌ను నియంత్రించే క్ర‌మంలో చేప‌ట్టిన జ‌న‌తా క‌ర్ఫ్యూకు సానుకూలంగా స్పందించారు.  ప‌ట్ట‌ణంలో వీధుల‌న్నీ నిర్మానుషంగా మారాయి.  రాష్ట్ర  ప్ర‌భుత్వం పిలుపు మేర‌కు ప్ర‌జ‌లెవరూ ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావడం లేదు. ఉద‌యం నుంచే రైల్వే స్టేష‌న్‌, బ‌స్టాండ్‌తో పాటు ప్ర‌ధాన కూడ‌ళ్లు అన్నీ నిర్మానుషంగా మారాయి.  కేవ‌లం పోలీసులు మాత్ర‌మే ప‌హారా కాస్తున్నారు.  రైళ్లు, బ‌స్సులు ర‌ద్దు కావ‌డంతో ఆయా ప్ర‌దేశాల్లోనూ జ‌న సంచారం క‌నిపించ‌లేదు.  ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాల‌కు అనుగుణంగానే జ‌నం క‌ర్ఫ్యూలో పాల్గొన్నారు.  ప‌ట్ట‌ణంలో షాపులు, హోట‌ళ్లు ఏ ఒక్క‌టీ తెరుచుకోలేదు.  సాధార‌ణంగా ఆదివారం రోజున బిజీ బిజీగా ఉండే రోడ్లు .. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ఖాళీ ప్ర‌దేశాలుగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.  నోవెల్ క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి స్వీయ నియంత్ర‌ణ పాటిస్తున్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన మ‌ద్ద‌తు ప్ర‌పంచ క్షేమానికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్న సంకేతాన్ని అంద‌జేశారు. ఒక్క జ‌న‌గామ‌లోనే కాదు, అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని గ్రామాల్లో.. ఊరువాడా అన్న తేడా లేకుండా జ‌న‌మంతా క‌ర్ఫ్యూ పాటిస్తున్నారు.  


logo
>>>>>>