శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 09:20:51

హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ

హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ

హైదరాబాద్‌ : నగరంలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతుంది. హైదరాబాద్‌ వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. మద్యం, మాంసం దుకాణలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు బంద్ అయ్యాయి. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ ప్రాంగణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంతో నిత్యం బిజీగా ఉండే నగర రహదారులు ప్రశాంత వాతావరణంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర సేవల కోసం డిపోకు 5 బస్సులను, అదేవిధంగా మెట్రో రైలు సర్వీసులను ఐదింటిని అధికారులు అందుబాటులో ఉంచారు. జనతా కర్ఫ్యూతో ప్రభుత్వం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్‌ నగరపాలక, పురపాలక సంస్థల్లో ప్రత్యేకంగా శానిటేషన్‌ డ్రైవ్‌ను చేపట్టింది. సిబ్బంది ప్రత్యేకంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు.logo