శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 05, 2020 , 17:43:49

జల దృశ్యం..జన్మ ధన్యం

జల దృశ్యం..జన్మ ధన్యం

కేసీఆర్‌ దీక్షాఫలంతో సిద్దించిన తెలంగాణ నేడు పాడి పంటలతో విరాజిల్లుతున్నది. ఎంతో ముందు చూపుతో సీఎం కేసీఆర్‌ జల సిరులను ఒడిసిట్టి ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుండడంతో నేడు బీడు భూములన్నీ మాగాణమవుతున్న తీరుపై నరేష్‌ కందుల కవిత.

నెర్రెలు వారే నేలలో జర్రున జాలువారుతున్న జలం..

ఎండిన ఎర్రరేగడిలో పండిన పచ్చటి పంటలు 

ఆకలి చూపులు చూసిన చోటే అన్నపూర్ణగా మారిందిప్పుడు..

కంట కన్నీరొలికిన చోటే పంట కాలువలు పారుతున్నాయిప్పుడు

 స్వర్ణ వర్ణంలో మెరిసిపోతున్న వరి పొలాలు..

నలుదిక్కులా ఎదిగిన మొక్కజొన్న చేలు 

కొత్త రాగం పాడుతున్న పత్తి చేను

 అవునూ ఇది భగీరథ యజ్ఞమే..!

 భూదేవిని తడిపిన గోదారి చిత్రమే !

 కడలిలో కలిసే నీటిని కట్టడి చేసిందెవరు ?

 చిత్తడి మైదానాన్ని చిగురులు తొడిగేలా చేసిందెవరు ? 

సాగునీటి కోసం సంకల్పించిదెవరు ? 

ఒక్కో నీటిబొట్టును ఒడిసిపట్టి..

దుక్కి దున్నే నేలకు ఇడిసిపెట్టి ..

తెలంగాణను ధాన్యాగారంగా మార్చిందెవరు ? 

అవునూ ఇది అపర భగీరథ యజ్ఞమే ..! 

శివుడి ఝఠాజూటం నుంచి గంగను నేలకు దించినట్టు ..

గోదారిని ఈ ధరికి తెచ్చిన వారు మహనీయులే ! 

తెలంగాణ గడ్డ ఎప్పటికీ మరిచిపోని మహానుభావులే ! 


logo