శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 17:13:08

మెట్టుగుట్టలో జైనమత శాసనం లభ్యం

మెట్టుగుట్టలో జైనమత శాసనం లభ్యం

వరంగల్‌ : వరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట, మడికొండలలో జైనమత ప్రాభవానికి సాక్ష్యాలుగా ఎన్నో శిథిల జైనబసదులు, మందిరాలు, శిల్పాలు కనిపిస్తున్నాయి. అందులో మరొక కొత్త శాసనాన్ని తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునీల్ మడికొండలో  చేసిన  పరిశోధనలో కొత్తగా జైన మతానికి చెందిన ధర్మనాథుని ప్రతిమ, పాదాలు, శాసనాన్ని గుర్తించారు. వరంగల్ జిల్లా కాజీపేటలోని మడికొండ, మెట్టుగుట్ట మీద జైనమతబసది ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 

రాష్ట్రకూటులకాలంలో ఈ ప్రాంతాన్నేలిన కొలనుపాక మహామండలేశ్వరుడు శంకరగండరస(క్రీ.శ.888) ఎన్నో జైనబసదులు, జైనగుడులు నిర్మించిన ఆధారాలు లభిస్తున్నాయి. ఆ సమయంలోనే మెట్టుగుట్టమీద కూడా జైనబసది నిర్మాణం జరిగివుంటుంది.     ఈ కారణంగానే  మెట్టుగుట్ట మీద ‘జినబ్రహ్మజోగి’ లఘుశాసనం, ధర్మనాథుని ప్రతిమ, పాదాలు చెక్కి ఉండవచ్చు. తెలంగాణాలో ఆదినాథ, పార్శ్వనాథ,మహావీరులకు అనేకచోట్ల జైనబసదులు, గుడులు నిర్మించబడ్డాయి. నేమినాథ, శాంతినాథ, సుపార్శ్వనాథ, అరనాథ, శీతలనాథులకు అరుదుగా జైనబసదులు, విహారాలు కనిపిస్తాయి.


logo