శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 04:41:18

మాస్కు ధరించకుంటే జైలే!

మాస్కు ధరించకుంటే జైలే!

  • వెయ్యి జరిమానా కూడా
  • సైబరాబాద్‌లో 3,153 కేసులు 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగా ణ: ‘మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారా.. అయితే తప్పనిసరిగా మాస్కు ధరించండి. లేదా జేబులో వెయ్యి రూపాయలు పెట్టుకోండి. లేకుంటే జైలు కు వెళ్లేందుకుసైతం సిద్ధంగా ఉండండి’ అంటూ హెచ్చరిస్తున్నారు సైబరాబాద్‌ పోలీసులు. మాస్కు ధరించాలని ఏప్రిల్‌లో వచ్చిన ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నారు. 

వాటిని ఉల్లంఘించి మాస్కు ధరించని 3,153 మందిపై ఇప్పటికే పెట్టీకేసులు నమోదుచేశారు. వీరందరినీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మాస్కులేకుండా వీధులు, రోడ్లపై సంచరిస్తున్నారని ఫొటోఆధారంతో జడ్జి ఎదుట బోనులో నిలబెట్టనున్నారు. తద్వారా ధర్మాసనం జైలుశిక్ష విధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.logo