బుధవారం 27 మే 2020
Telangana - May 06, 2020 , 21:17:32

కరోనాతో కోరుట్ల వాసి దుబాయ్‌లో మృతి

కరోనాతో కోరుట్ల వాసి దుబాయ్‌లో మృతి

జగిత్యాల: కరోనా పాజిటివ్‌గా తేలి చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరు దుబాయ్‌లో చనిపోయారు. మృతుడు (48) కోరుట్ల వాసి. చాలా రోజుల క్రితం ఉపాధి వెతుక్కొంటూ దుబాయ్‌ వెళ్లిన ఈయన.. దుబాయ్‌లోని జెబలాలి కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెల 27వ తేదీన ఆరోగ్య సమస్యలతో దవాఖానకు వెళ్లగా.. కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. దాంతో ఆయనను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. చివరకు మంగళవారం ఉదయం చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

కరోనా వైరస్‌ లక్షణాలతో చనిపోయినందున మృతదేహాన్ని కోరుట్లకు పంపే అవకాశాలు లేవు. దాంతో ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఈటీసీఏ) ఆధ్వర్యంలో దుబాయ్‌లోనే అక్కడి అధికారులు మృతదేహానికి మంగళవారం రాత్రి అంతమ సంస్కారాలు నిర్వహించారు. మృతుడి కుటుంబానికి అండగా నిలువాలని ఈటీసీఏ వ్యవస్థాపకుడు పీచర కిరణ్‌కుమార్‌, అధ్యక్షుడు రాధారపు సత్యం తదితరులు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.


logo