శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 20:29:04

సూర్యాపేట‌లో క‌బ‌డ్డీ అకాడ‌మీ ఏర్పాటుకు కృషి : మ‌ంత్రి జగ‌దీశ్‌రెడ్డి

సూర్యాపేట‌లో క‌బ‌డ్డీ అకాడ‌మీ ఏర్పాటుకు కృషి : మ‌ంత్రి జగ‌దీశ్‌రెడ్డి

న‌ల్ల‌గొండ : సూర్యాపేట‌లో క‌బ‌డ్డీ అకాడ‌మీని ఏర్పాటు చేసేందుకు కృషి చేయ‌నున్న‌ట్లు మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్ మంగ‌ళ‌వారం సూర్యాపేట‌లోని క్యాంపు కార్యాల‌యంలో మంత్రిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌గదీశ్‌రెడ్డి క‌బ‌డ్డీ అకాడ‌మీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయ నూత‌న భ‌వ‌నం పూర్తయిన అనంత‌రం  జిల్లాలో కబడ్డీతో సహా అన్ని ఆటలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సూర్యాపేట నూత‌న జిల్లాగా ఏర్పడిన తరువాత ఔట్‌డోర్‌ స్టేడియంలో జిల్లా పోలీసు కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన‌ట్లుగా చెప్పారు. జిల్లా నుండి అనేక మంది రాష్ట్ర, జాతీయస్థాయి కబడ్డీ ఆటగాళ్ళు ఉన్న‌ట్లు త‌న‌కు తెలుస‌న్నారు. ప్ర‌స్తుతానికి ఇండోర్, ఔట్‌డోర్ ఆటల కోసం సూర్యాపేట‌, తుంగతుర్తి, హుజుర్‌న‌గ‌ర్‌, కోడాడ‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో తాత్కాలిక షెడ్లు, మ్యాట్స్ ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.