శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 02:51:31

గ్రీన్‌చాలెంజ్‌ జబర్దస్త్‌ మొక్కలునాటిన రష్మి

గ్రీన్‌చాలెంజ్‌ జబర్దస్త్‌ మొక్కలునాటిన రష్మి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వాతావరణంలో హెచ్చుతగ్గుల్ని సమతుల్యం చేయడానికి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉన్నదని జబర్దస్త్‌ యాంకర్‌, సినీనటి రష్మి అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా శనివారం ఆమె హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు. మరో ముగ్గురిని నామినేట్‌ చేశారు. మనసుండాలేగానీ మొక్కలు నాటడానికి ఖాళీస్థలం లేదనే ప్రసక్తే ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను రష్మి అభినందించారు.logo