గురువారం 04 జూన్ 2020
Telangana - May 02, 2020 , 16:47:51

దాతలు దాతృత్వం చాటుకునే సమయమిదే : మంత్రి ఎర్రబెల్లి

దాతలు దాతృత్వం చాటుకునే సమయమిదే : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌ : వితరణలు, విరాళాలతో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకునే మంచి సమయమిదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా, మహబూబాబాద్‌ జిల్లాల్లో మంత్రి నేడు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. పర్వతగిరి, అమ్మాపురం, తొర్రూరు, పెద్దవంగరలో మంత్రి పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి పర్యతగిరి ఇండ్లలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. అమ్మాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. తొర్రూరులో వందేమాతం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గర్బిణీలు, బాలింతలు 400 మందికి పౌష్టికాహారం అందజేశారు. పెద్ద వంగరలో స్థానిక ఎంపీటీసీ సిరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా అదుపులోనే ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అభినందించారన్నారు. 


ప్రతీ నీటి చుక్కను ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దన్నారు. రవాణా, గన్నీ బ్యాగులు, గోదాముల వంటి సమస్యలను త్వరలోనే అదిగమిస్తామన్నారు. విద్యా, వైద్య రంగాలతో పాటు సామాజిక సేవకు దిగిన వందేమాతరం ఫౌండేషన్‌ని మంత్రి అభినందించారు. తెలంగాణ జాగృతి యూత్‌ నాయకులు కోరబోయిన విజయ్‌, మారుపల్లి మాధవి తదితరులు మంత్రికి కరోనా నివారణ చర్యల్లో భాగంగా 5 వేల మాస్కులను అందజేశారు. ఈ మాస్కులను ప్రజలకు పంపిణీ చేయాల్సిందిగా కోరారు.


logo