బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 22:07:17

హరితహారాన్ని విజయవంతం చేయాలి

హరితహారాన్ని విజయవంతం చేయాలి

హైదరాబాద్‌ : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. 6వ విడుత హరితహారం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకే సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. పచ్చదనం లేకుంటే మనుషులకు స్వచ్ఛమైన గాలి లభించదని, ఆక్సీజన్‌ లేకుంటే ఏ ప్రాణి మనుగడ సాధించ లేదని అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణాగా మార్చాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాటి నుంచి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. ఏటా విరివిగా మొక్కలు నాటుతున్నామని, ఈ సారి ౩౦ కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలోనూ మొక్కలు పెంచాలని ఆయన కోరారు.logo