బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 16:07:17

ఫలించిన హుజూర్‌న‌గ‌ర్ నియోజకవర్గ యువత కల : శానంపూడి సైదిరెడ్డి

ఫలించిన హుజూర్‌న‌గ‌ర్ నియోజకవర్గ యువత కల : శానంపూడి సైదిరెడ్డి

సూర్యాపేట : హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఐటీఐ కాలేజీని మంజూరు చేస్తూ ప్ర‌భుత్వ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎప్ప‌టినుండో ఎదురుచూస్తున్న నియోజ‌క‌వ‌ర్గ యువ‌త క‌ల నెర‌వేరింద‌ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ట్విట్ట‌ర్ ద్వారా ఎమ్మెల్యే స్పందిస్తూ... హుజూర్‌న‌గ‌ర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా "కృతజ్ఞత సభ"‌లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు  ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు, అదేవిధంగా యువత అభివృద్దే లక్ష్యంగా అడిగిన వెంటనే ఎన్ఏసీ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఇప్ప‌టికే ఆదేశాలు మంజూరు అయిన‌ట్లు తెలిపారు. రానున్న రోజులలో విద్య, ఉపాధి, సాంకేతికరంగంలో  యువతను ముందంజలో ఉంచుటకు త‌న వంతుగా మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా సైదిరెడ్డి అన్నారు. అడిగిన వెంటనే మంజూరు చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్, యువనాయకులు కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి ఆయ‌న ప్రత్యేక కృతజ్ఞతలు  తెలిపారు.


logo