ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:31:58

ఆపదలో అండగా..

ఆపదలో అండగా..

  • క్షతగాత్రుడి చికిత్సకు రూ.1.25 లక్షల ఎల్వోసీ  
  • మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్‌ 

ఎల్లారెడ్డిపేట: రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి శస్త్రచికిత్స కోసం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.1.25 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన సోపాల నాగరాజు వారం క్రితం మెదక్‌ జిల్లాలోని బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్తుండగా పాతూరు సమీపంలో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు చేతులతోపాటు ఎడమకాలి కి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు. కాగా, నాగరాజు తల్లి బోన్‌ క్యాన్సర్‌తో ఐదేండ్ల క్రితం మృతి చెందగా.. తండ్రి సత్తయ్య కూడా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 

ఈ నేపథ్యంలో నాగరాజు చికిత్సకు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. రాజన్నసిరిసిల్ల టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య.. నాగరాజు దీనస్థితిని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందిం చిన మంత్రి రూ.1.25 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. ఆపదలో అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.


logo